Create Free Blog | Random Blog »   Report Abuse | Login   

 
Go to content Go to navigation Go to search

చిరంజీవి రాజకీయ లక్షాలు - తెలంగాణ ఆంశం

చిరంజీవిమీద, ప్రజారాజ్యంమీద పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్న వాళ్ళలో నేనూ ఒక్కడిని. స్వతహాగ నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, సేవాతత్పరుడుగ కనిపించే చిరు- మన రాజకీయ, సామాజిక సాంప్రదాయాలలొ మార్పులు తీసుకొచ్చి మన పిల్లలకోసం, మన రేపటితరంకోసం మెరుగైన సమాజాన్ని తయారుచేయగలరని చాలా భలంగా ఆశపడ్డాను. కానీ దురదృష్టవశాత్తు సమీపగతంలో మన రాష్ట్రంలో చోటుచేసుకున్న కొత్త రాజకీయ సమీకరణాలు తదనంతర పరిణామాలు నా ఆశలమీద నీళ్ళు చల్లుతున్నాయి! అన్నింటికంటే మించి నేను ఎదురుచూశినంతగ చిరంజీవి, ఆయన పార్టీ, తన ప్రసంగాలు తెలుగు ప్రజానీకాన్ని, సమకాలీన రాజకీయచిత్రపటాన్నీ ప్రభావితం చేయలేక పోతున్నాయి! అన్నింటికీ మించి తన చుట్టూ మూగిన అనుయాయిలు వారి మాటలు ప్రజల్లో మరింత అపనమ్మకాన్ని కూడగట్టే ప్రమాదం ముంచుకొస్తోంది! ఎంతో ఉత్సాహంగ పార్టీ ప్రారంభించిన చిరంజీవికి అక్కడినుంచి ఎటుప్రయాణంచేయాలో తెలియడం లేదనిపిస్తుంది. తనముందున్న పెనుసవాళ్ళేవో ఆయనకు అవగతంకావడంలేదు. తనకు తగిన మార్గదర్శకం చేశి, సాయపడాలన్న నా చిన్న ప్రయత్నమే ఈ క్రింది విశ్లేషణ. మరి దీన్ని ఆయనకు ఏవిధంగ చేర్చాలో తెలియక, ఇల మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీలో ఎవరైన దీన్ని గమ్యం చేర్చగలరని ఆశిస్తున్నాను.

1. ఒక తెలుగువాడిగ నేను ప్రస్తుత రాజకీయాలతో విసిగి పోయాను. గత కొన్ని దశాబ్దాలుగ మన రాజకీయాలు వాటిని నెరిపేవారి ప్రవర్తన దారి మళ్ళిపోయింది. ఇక్కడ మంచి లేదు. మర్యాదలేదు. నీతి, నిబద్దతలేదు. ఏపార్టీ ఐన, ఎవరితోనైన, ఏ సమయంలోనైన చేతులు కలపగలదు. తెలంగాణ కావాలంటు వేరుపడి, తెలుగుదేశం పార్టీని, చంద్ర బాబును తీవ్ర పదజాలంతొ పది సంవచ్చరాలు విమర్సించిన చంద్రశేఖర రావు; ఈ రోజు చల్లగ తెలుగుదేశంతొ చేతులు కలిపారు. గతంలో కాంగ్రెస్తోి పని చేశిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇక అదే కాంగ్రెస్నున భూస్తాపితం చేస్తు, పాతిపెడుతు ముందుకు పోతుంది. ఇన్నాళ్ళు తిట్లుతిన్న బాబు ఈ రోజు రావు గారింట్లో వొందారగించి వచ్చారు. ఇలాంటి రాజకీయ వైపరీత్యాలు నేను గతంలో చాలానే చూశాను ఇకపైన చూడనన్న నమ్మకమూలేదు. చేతులు కలపడం తప్పుకాదు తెలంగాణకోసం పోరాటం అంతకంటేతప్పుకాదు; కాని వారిద్దరు గతంలో దిగిన వ్యక్తిగత దూషణల తీవ్రత తప్పు. అలా ఒక్కరినొక్కరు అంత దిగజారి తిట్టుకిని మళ్ళీ ఇల సిగ్గువిడవడం తప్పు, వీటన్నింటిని విని, చూశిన మమ్మల్ని వెధవల్ని చేయడం తప్పు. ఇంకా మాట్లాడ్డమే సరిగారాని మన పవన్ కల్యాణ్, గత వారం రోడ్డెక్కి పంచెలూడదీయండంటు విరుచుకుపడ్డం, పాతతరం కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు తనకు తేడాలేదని పించడం బాధాకరం. మరి దారిలేక తన తమ్ముణ్ణి సమర్థించడం చిరు సమర్థించడం ఇంకా బాధపడాల్సిన విశయం! అంతేకాదు, ప్రజారాజ్యంకూడ పాతబడ్డ తిట్ల రాజకీయ సాంప్రదాయాన్నే మామీద రుద్దనుందన్న భయం నాకు పట్టుకుంటూంది. ఒకవేళ ఎదుటి వారిని తీవ్ర స్వరంతో తిట్టడంవలన తను రాజకీయాలలో పైకొస్తాననొ, నలుగురిలో తనకు గుర్తింపు వస్తుందనో పవన్ కానీ, మరెవరైన అనుకుంటే -అది వారి వెర్రితనం. మర్యాద పూర్వకమైన రాజకీయాలను తెలుగువాళ్ళాశిస్తున్నారు మాకదే ప్రజారాజ్యంపార్టీ అందించాలి.

2. ఈరోజు తెలంగాణ అనేది ఒక విచిత్రమైన పదంగా తయారయింది! దీన్ని ప్రేమించేవాళ్ళు కొందరు, ద్వేషించేవాళ్ళు మరి కొందరు. దీన్ని చూసి భయపడేవాళ్ళుకొందరు. ప్రజలలో వుద్వేగాన్ని రెచ్చగొట్టేవారు మరికొందరు. ప్రచారానికి, తమ పరపతి, పలుకుబడులను పెంచుకోవడనికీ మరికొందరు వాడుకుంటున్నారు. చివరికి, ప్రజలను చైతన్య పరచాల్సిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియ కూడ ఈ అంశాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఎంతో విలువైన తమ ప్రసార సమయాన్ని ఇల ప్రజల్ని తప్పు దోవ పట్టించడానకి వాడుకుంటున్న టివి చానెళ్ళతో సహ అందరు మన సంఘవ్యతిరేకులె. మన ఇంట్లో చేరి మన మధ్యనే చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న పనికిమాలినవాళ్ళు. అసలు తెలంగాణ అనే పదమే తెలుగు వారికి అర్థంకాకుండ చేసేస్తున్నారు! అంతెందుకు, మన చిరుకు గాని ఆయన పార్ట్రీలోని వారిక్కానీ ఇది ఇంతవరకు అవగతంకాలేదు. తెలంగాణకు, కాదంటే తెలంగాణ ప్రజలకు కోపంవస్తుందని భయం. అవునంటే ఆంద్ర తీర ప్రాంతంవారికో, రాయలసీమ వాసులకో రుచించదని అనుమానం. తెలుగు వారు, తెలివైన వారు. తెలియజెబితే చాలు, చక్కగ అర్థంచేసుకుంటారు. సామాన్య ప్రజానీకానికేవిధంగ మేలు చేయాలో తెలియక కాదు. వాళ్ళలా అఙ్నానంతో కొట్టుకుంటేనే తమ పబ్బంగదుస్తుందని రాజకీయ నాయకుల కుటిలబుద్ది. తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని వెలిబుచ్చ కుండ ప్రజారాజ్యంకూడా తెలంగాణ విషయంలో ఈ కుతంత్రాన్నే చేస్తూందా, అన్న అనుమానం కలుగుతూంది. ఒక వేళ చిరుకు, ఆయన అనుచరగణానికి తెలంగాణ గురించిన పూర్వాపరాలు, ప్రాముఖ్యము తెలియకుంటే; మాకేంకావాలో చెప్పడానికి మేమిక్కడున్నాము.
i. ఆశించిన మంత్రిపదవి దక్కని ఒకానొక ప్రభుద్దుడు, తానే కొత్త రాష్ట్రం తెచ్చుకుని -ఏకంగ ముఖ్యమంత్రినే అవుదామని వేశిన మాస్టర్ప్లాాన్ ఈ సరికొత్త తెలంగాణ ఉద్యమం. దీన్ని తీవ్రంగ వ్యతిరేకించి, దెబ్బతిని, తరువాత స్వరం మార్చింది తెలుగుదేశం. గెలిచిన తరువార రాజశేఖర రెడ్డిగారికి ఉన్న భలమైన అభ్యంతరం ఒక్కటే -మన పొట్టి శ్రీరాములు గారిలాగ, ఎవరి కృషి ఫలితంగానో వచ్చినదానిలాగ తెలగాణం అవతరించడం తన ఇష్టంలేక! అన్నింటికంటే ముఖ్యంగ, భాద్యతాయుతంగ వ్యవహరించాల్సిన మన తెలుగు మీడియ కూడ, తమ వ్యాపార ప్రయోజనాలకోసం తెలంగాణను వాడుకోవడం నాకు చాలా బాధను మిగిల్చింది.
ii. తెలుగు ప్రజలుగ, మా ప్రయోజనాన్ని ఆశించే రాజకీయ నాయకులు, పార్టీలు, పాలకులు, ప్రజా ప్రముఖులు ఎవరైనఉంటే వారికిదే మామనవి. తక్షణం ఈ గోల ఆపండి. ఇది మాకు, కూటికి గుడ్డకు కొరగాదు. ఈ ముసలం, అన్నదమ్ములమైన మమ్మల్ని ఒకరికొకరు కాకుండాచేస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఎంతోవిలువైన మాకాలాన్ని, అభివృద్దికి పనికి వచ్చే మా తెలివితేటల్ని ఇల పనికిమాలిన వాటికి పరిమితం చేస్తూంది. మాలోమాకు గొడవలు పెట్టి మమ్ములను మాకు కాకుండాచేస్తూంది. అభివృద్ధిని ఆలశ్యంచేస్తూంది.

iii. తెలుగు, ప్రపంచంలో పదునాల్గవ అతి పెద్దభాష. తమిళాన్నికూడ వెనక్కునెట్టేస్తూ దేశంలో రెండవదిగ నిలుస్తూంది. దురదృష్ఠవశాత్తూ మన భాషకు, జాతికి జాతీయ, అంతర్జాతీయ స్తాయిలో తగిన గుర్తింపులేకుండాపోయింది. రెండువేల సంవచ్చరాల చరిత్ర కలిగిన మన తెలుగుకు డిల్లీలో ప్రాచీన హోదాకోసం మల్లగుల్లాలు పడాల్సిన దైర్భాగ్యం! అది మన హక్కు, ఎవరోవేశేభిక్షంకాదు! మనం చాలావిషయాలకు సిగ్గుపడాలి. తల్లిభాషకు ప్రాచుర్యం కల్పించడంలోజరిగిన మన వైఫల్యం చాలవరకు మన పాలకులదే. రామారావుగారు ఈ దిశగ సాగించిన కృషిని తరవాతివారు కొనసాగించలేకపోయారు.

iv. ఇప్పుడు మరోతెలుగు రాష్ట్రం అవతరిస్తుందంటే మనమెందుకు వేలంవెర్రిగ పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నాము? ఇది చాల మంచిపరిణామం. కొత్తగ తెలంగాణ ఏర్పడినంతమాత్రాన, ఆ భూభాగాన్ని కోసి ఏ మధ్యదరా సముద్రంలోనో విశిరేయరు. అదక్కడేవుంటుంది. భారతదేశపౌరులుగ మనం ఏ రాష్ట్రంలోనైన సమాన హక్కులను, హోదాను అనుభవించవచ్చు. తెలంగాణంలో స్థిరపడిన వారెవ్వరినీ పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు. అది చంద్రశేఖరరావుకైనా సరె. ఇలా జరుగుతున్నవి తప్పుడు ప్రచారాలు. రాష్ట్రవిభజన చేయగానే కొంతమంది కబ్జాదారులు, నేరగాళ్ళు ప్రజలను భయపెట్టే అవకాశంలేకపోలేదు. కనుక ఇది ప్రభుత్వం తన భాద్యతగ భావించి రాష్ట్రవిభజనను రెండు సంవచ్చరాలకాలవ్యవధిలొ, కుదుపులు లేకుండ క్రమపద్దతిలో, కట్టుదిట్టమైన భద్రతమధ్యన జరపాలి.

v. అన్నింటికంటేముఖ్యంగ, తెలుగుమాట్లాడుతున్న పొరుగురాష్ట్రాలలోని పరిసర ప్రాంతాలను కొత్త రాష్ట్రాలలో కలపాలి, విస్తరించాలి. తెలుగు ప్రాచుర్యం ఉండి, నిరాదరణకు గురవుతున్న దక్షణ ఓరిస్సా ప్రాంతాలయిన భరంపూర్, కోరాపూర్లను ఆదరించాలి, అక్కున చేర్చుకోవాలి. దక్షణ చత్తీస్ఘదడ్ తోపాటుగ మహారాష్ట్రలోని దిగ్లూరర్ పరిసర ప్రాంత తెలుగు వారిని కలుపుకొని ఆణగారిన, అక్కడి తెలుగు వారిని మనతోడు కలుపుకొని ప్రోత్సహించాలి. అక్కడి తెలుగువారికి మనవారిగ, తెలుగువారిగ గుర్తింపు కలిగించాలి. మనవారు, పర భాష మీద తమ వునికిని కలిగివుండడం మనకవమానంకాద?

vi. అలాగె: తెలుగువారు అత్యధికులుగ నివశిస్తున్న కర్నాటకలోని ముళబాగల్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హోసూర్ లను పరభాషాపాలననుంచి విముక్తుల్నిచేయాలి. ఆయాప్రాంతాలను రాయలసీమతోకలుపుతూ, నెల్లూరు జిల్లాతొసహ బాలాజీ రాష్ట్రాన్ని / లేద క్రిష్ణదేవరాయ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలి. ఒరిస్సా, తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఆయాప్రాంతాల తెలుగు ప్రజలకోసం అరకొరగ తెలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారని, అక్కడ మన తల్లిభాష నిరాదరణకు, అవమానానికి గురవుతూందని మన రాజకీయనాయకులకు చాలామందికి తెలియదు. గత కొన్ని సంవచ్చరాలుగ ఎనభై సాతం తెలుగు ఉపాద్యాయ నియామకాలను చేయకుండ ఆపేశి; ఒక పధకంప్రకారం తిరుత్తణి, రాణీపేట, గుదియాతం, వన్నియంబాడి, తిరుపత్తూర్, క్రిష్ణగిరి, హోసూర్ లలో తెలుగును తుడిచిపెట్టేస్తున్న తమిళ నాడు కుతంత్రాలు మనకెంతమందికి తెలుసు? మన తెలుగును కాపాడుకోవాల్సిన భాద్యత మనకులేద?

vii. వై. యస్. రాజశేఖర రెడ్డి గారు, ఢిల్లీలో తనకున్న పరపతిని, పలుకుబడిని తెలంగాణ వ్యతిరేకదిశలో దుర్వినియోగంచేయకుండ, తెలుగు జాతిని మూడు కొత్త రాష్ట్రాలకు -మరింతమంది తెలుగు వారిని ప్రోత్సహించి మనభావితరాలకు చిరస్మరణీయుడుగ ఎందుకు నిలవాలని ఎందుకు అనుకోవడంలేదు. ఈ నూతన ఆవకాశాన్ని ఒక ప్రభంజనంగ చిరంజీవి ఎందుకు ముందుకు తీసుకొనిపోలేకపోతున్నారు? ఇలా చేయగలిగితె చిరు రాజకీయాల్లోనేకాదు; మూడు రాష్ట్రాలలో విస్తరించబోయే పన్నెండు కోట్లమంది తెలుగు ప్రజానీకానికి ‘హీరొ’ గ నిలవగలరు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మహోన్నతంగ ఇనుమడింపజేశిన తెలుగువాడిగ చరిత్రకెక్కగలరు. ఈ తరుణంలొ -తెలుగువారి ప్రాతినిద్యంవున్న పొరుగు రాష్ట్రాలలోసైతం పోటీచేయాలని ఈ రోజు తెరాసా నిర్ణయాన్ని నేను స్వాగతిసున్నాను. అందుకు కెసిఆర్ ను మనస్పూర్తిగ అభినందిస్తున్నాను. ఈ స్పూర్థిని అన్ని రాజకీయ పక్షాలూ స్వీకరించాలి, అలవరుచుకోవాలి, కొనసాగించాలి.

3. ఈ రోజు చిరంజీవి తన నెల్లూరు జిల్ల పర్యటనలొ ప్రసంగిస్తు వంద రూపాయలకు ఒక నిత్యావసర వస్తువుల ప్యాకేజ్నిల ప్రకటించారు. మాకు ఇదివరకే ఇలాంటి ప్యాకేజ్టూిర్లున చాలామందిచ్చారు. లేద, లోక్స్త్త జయప్రకాష్ నారాయణ్ భాషలొ చెప్పాలంటె; ఇదివరకె మాకు చాలమంది బిచ్చంవేశారు. ఇల ప్రజలను బిక్షగాళ్ళను చేశె ప్రజాకర్షక పధకాలు మాకవసరంలేదు. వందకు అన్నీఇచ్చిన, ఒక్క రూపాయకే ఇచ్చిన ఎవరిజేబులోంచీ ఇవ్వరని ఈరోజుటి పల్లెటూరి వోటర్లకుకూడ తెలుసు. ఇప్పుడు మన సమాజం ఇంతకంటె గంభీరమైన సవాళ్ళను ఎదుర్కుంటూంది. సహ పంక్తిభోజనాలతొ సామాన్యునికి సాధికారత సాధ్యంకాదు. ఇలా అన్ని పార్టీల్లాగ తాయిలాలు ప్రకటించడం మాని; రాష్ట్రప్రజల సమగ్రార్థికాభివ్రుద్ధికి పధకరచనచేయాలి. మన కున్న సహజ వనరులను, అన్నింటికంటేముఖ్యంగ బహు విస్తారంగ, బహుముఖంగ ఉన్న మన మానవ వనరుల్ని సద్వినియోగించి ప్రపంచ విపణివీధిలో మన సత్తా చాటాలి. విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. తద్వార మన పల్లెప్రజలు సైతం తమప్రాంతంలోనె సంపదను సృష్టించేవారు కావాలి. వాళ్ళను బిక్షగాళ్ళను చేసే ఆలోచన మానుకోవాలి.

4. చిరంజీవి తనకోసం ఒక వెబ్సైసటును ప్రారంభించాలి. అందులో, విద్య, వైద్యం, రక్షణ, రెవిన్యూ, ఆర్థిక శాఖ; ఇల అన్ని రంగాలకు సంబంధించి విడివిడిగ ప్రజాభిప్రాయాల్ని ఆహ్వానిస్తు బ్లాగులను, కామెంట్లను ప్రజలనుంచి ప్రొత్సహించాలి. ప్రతి రోజు చిరు స్వయంగ, కనీసం ఒక గంట ఇవి చదవడానికి కేటాయించాలి. దీనివలన ప్రజల నాడిని తెలుసుకునె అవకాశం ఆయనకు కలుగుతుంది. తన చుట్టూచేరిన భజనపరుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలిగె అవకాశం కలుగుతుంది.

5. మనమిప్పుడు ఎదుర్ఖుంటున్న ప్రధానసమశ్య అవినీతి. వేళ్ళూనుకున్న అవినీతి. దీన్ని తుదముట్టించడానికి తగు నడుం బిగించాలి. తానేవిధంగ అవినీతిని; ఈ సామాజిక, రాజకీయ రుగ్మతను నిర్మూలించగలరో ప్రజలకు వివరించాలి. తన దగ్గర ఏమీలేకుండ, తను వారికేంచేయగలనొ చెప్పకుండ వెళ్ళి -నన్ను ముఖ్యమంత్రిని చేయండని అడగడం… చిన్న పిల్లాడిపనిలాగ కనిపిస్తూంది.

6. పార్టీపెట్టగానె వందకోట్ల రూపాయల సేకరణ జరిగిందన్నది ఈ రోజు వినవచ్చిన కొత్త విమర్శ. గత పది పదిహేనేళ్ళలొ చోటుచేసుకున్న సరళీక్రుత ఆర్థిక విధానంకావచ్చు, ఇతరత్ర జరిగిన సామాజిక, రాజకీయ, రియల్ఎేస్టేట్, సాఫ్ట్‌వేర్, వ్యాపార, వుద్యోగ పరిణామాలవల్ల కావచ్చు మన ఆంధ్ర ప్రదేశ్లొయ ఒక మూడువేలమందిదాక కొత్తగ ధనవంతులయ్యారని ఒక అంచన. వీరు పది నుంచి యాభై కోట్లు పోగే శి, ఒక నియో-రిచ్ తరగతికి రూపమిచ్చారు. వీరిలో చాలామంది చిరును స్వయంగ సంప్రదించి, ప్రోత్సహించి; ఆయనచేత రాజకీయ రంగప్రవేశం చేయించినట్లు వినికిడి. ఇందులోతప్పులేదు. ఆయనకు వారు ఆర్థికంగాకూడ సహకరించవచ్చు. అదీ తప్పుకాదు. కానీ చిరంజీవి, ఈ కొత్త ఆర్థికవర్గమె తెలుగు ప్రజానీకమనో లేక వీరు సకల తెలుగు ప్రజానీకానికీ ప్రతినిధ్యంవహిస్తారనొ అనుకుంటె అది పొరబాటు. చాలా ఊళ్ళలొ ఈ నియో-రిచ్ క్లాస్ వారు చిరు అభిమానుకలు పార్టీలో స్థానంలేకుండాచేశారని కోపోధ్రిక్తులైన పలువురు పాత అభిమానులు పార్టీ కార్యాలయాలమీద, కొత్తగ నియమితులైన క్యాడర్మీచద దాడి చేయడం ఇందుకు నిదర్శనం. పార్టీ అధికారంలోకివస్తె; అధినేత, ఈ నియో-రిచ్ క్లాస్కున కొమ్ముకాయడనే ఆశిద్దాం.

Share SocialTwist Tell-a-Friend 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ -యువరాజ్యం (పార్టీ యువ శక్తి) అధ్యక్షుడిగ పవన్ కల్యాణ్ ఎంపిక సరైందేన?

<!– /* Font Definitions */ @font-face {font-family:Gautami; panose-1:2 0 5 0 0 0 0 0 0 0; mso-font-charset:1; mso-generic-font-family:auto; mso-font-pitch:variable; mso-font-signature:2097152 0 0 0 0 0;} @font-face {font-family:”Cambria Math”; panose-1:2 4 5 3 5 4 6 3 2 4; mso-font-charset:1; mso-generic-font-family:roman; mso-font-format:other; mso-font-pitch:variable; mso-font-signature:0 0 0 0 0 0;} @font-face {font-family:Calibri; panose-1:2 15 5 2 2 2 4 3 2 4; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:-1610611985 1073750139 0 0 159 0;} /* Style Definitions */ p.MsoNormal, li.MsoNormal, div.MsoNormal {mso-style-unhide:no; mso-style-qformat:yes; mso-style-parent:”"; margin-top:0in; margin-right:0in; margin-bottom:10.0pt; margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Arial; mso-bidi-theme-font:minor-bidi;} .MsoChpDefault {mso-style-type:export-only; mso-default-props:yes; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Arial; mso-bidi-theme-font:minor-bidi;} .MsoPapDefault {mso-style-type:export-only; margin-bottom:10.0pt; line-height:115%;} @page Section1 {size:8.5in 11.0in; margin:1.0in 1.0in 1.0in 1.0in; mso-header-margin:.5in; mso-footer-margin:.5in; mso-paper-source:0;} div.Section1 {page:Section1;} –>
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:”";
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;}

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ -”యువరాజ్యం” (పార్టీ యువ శక్తి) అధ్యక్షుడిగ పవన్ కల్యాణ్ ఎంపిక సరైందేన?

ఎందుకనొ నేతలకందరికి ఎన్నికల ముందు సామాజిక న్యాయంఅనె జ్వరంపట్టుకుంది! స్వాతంత్రం వచ్చిన ఆరు దశాబ్దాలలొ జరగని న్యాయం ఇప్పుడు వోట్లేస్తె ఆరునెల్లలొ తీసుకొస్తామనడం హాస్యాస్పదం! చాలామంది సగటు పౌరుల్లాగె చిరంజీవి మన జీవితాల్లో వెలుగు తెస్తారని ఎదురు చూశాను కాని సమీప గతంలొ జరిగిన ప్రజారాజ్యం మార్పులు దిగులు పుట్టిస్తున్నాయి. చిరరంజీవి చేతులు కాలకముందె జాగ్రత్తపడాతారని ఆశిద్దాం!

చిరంజీవికి మాస్ వోటర్లను ఆకర్షించగలిగె సమ్మోహన శక్తి తప్పకుండవుంది దాన్ని గురించిన దిగులనవసరం. కాని, చదువరులను మెధావులను తన వైపుకు తిప్పుకోవడానికి సినిమా గ్లామర్ సరిపోదు. తన విధి విధానాలను సమగ్రంగ ఆయన ప్రకటించాలి. తన వెనుక గాంధీ, మదర్ తెరిస, అంబేత్కర్ తదితరుల బొమ్మలను పెట్టుకొవడం వెనుక కొన్ని విమర్శలు వినవస్తున్నాయి. పార్టీలొని విధానాల లోపాన్ని ఇలా పూడ్చుకుంటున్నారని అంటున్నవారూలేకపోలేదు. నిన్న Tv5 ఎడిటోరియల్ లో ప్రస్తావించినట్లు; చిరంజీవి ప్రసంగాలలొ వాడి లోపించింది. నాయకులు తమ ప్రసంగాలలొ చేసే వ్యాఖ్యానాలను ప్రజలు నెమరేసుకోవాలి. తనకంత భాషా పరిఙ్నానం లేకుంటె, సాయం తీసుకోవడంలొ ఏమాత్రం తప్పులేదు. సామాజిక, రాజకీయ అవగాహనకోసం మేధావులను సంప్రదించడానికి వెనుకాడాల్సిన అవసరంలేదు. తనకిప్పుడు కావాల్సింది ప్రభావితం చేయగలిగె శక్తి. సాధించడానికి స్థిరమైన లక్షాలు. అన్నింటికి మించి, తాము చేస్తున్నదానిపట్ల చిత్త శుద్ది.

ఈ రోజు తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను యువరాజ్యం (పార్టీ యువ శక్తి) అధ్యక్షుణ్ణి చేయడం ఒక వెర్రిపనిలాగే కనిపిస్తుంది! అతని అర్హతల మాటలావుంచి, చిరంజీవి లేకుంటె -పవన్ ఎవరు? ఒక సినీనటుడుకూడ కాలేడు. ఎనిమిది కోట్ల ఆంధ్రులలొ ఇంతకంటె సమర్థుడు, తెలివైనవాడు, సామాజిక స్పృహవున్న యువకుడు, రాజకీయ చైతన్యం కల నాయకుడు చిరంజీవికి దొరకలేద? ఈ చర్య, చిరంజీవి రాజకీయాగమనానికి సంభంధించిన ప్రాధమిక లక్షాలకే ప్రశ్నగ నిలుస్తూంది. పాపం పవన్, ఒక పది నిమిషాలు విలేఖరుల ముందు మాట్లాడడానికి మల్లగుల్లాలు పడ్డడు. తనను ప్రభావితం చేశిన ఒకానొక గతానుభవాన్ని చెపుతు: హైస్కూల్ చదువుతున్న రోజుల్లొ డైనమొ లేని సైకిల్ తొక్కుతున్నందుకు ఒక కానిస్టేబుల్ తనను స్టేషన్ కి తీసికెళ్ళి కొన్నిగంటలు వుంచినపుడు సహాయంకోసం ధీనంగ దిక్కులు చూసినట్లుచెప్పాడు. ఇప్పుడుకూడ, చిరు పక్కనకూచుని విలేఖరులతొమాట్లాడుతు తెల్లమొహం వేసుకుని ధీనంగ దిక్కులుచూస్తున్నాడు. పాపం అప్పుడతన్నిచూసినవారికెవరికైన జాలేయకమానదు! తను చాలా కాలంగ ఒక రాజకీయ ప్రక్షాళణ తీసుకురాగలిగిన నాయకత్వంకోసం ఎదురుచూశినట్లు పవన్ చెప్పారు. నిజానికి, అలాంటి అద్భుతం జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా రూపంలొ తీసుకొచ్చారు. అందులో సమృద్ధమైన భావజాలం వుంది. నిజానికి ప్రజా రాజ్యం పార్టీ లోని లోపాల్ని పూడ్చగలిగె శక్తికూడ లోక్ సత్తా కుంది. మరి పవన్ నిజంగ మార్పును అంత తీవ్రంగ కోరుకుంటున్నట్లైతె లోక్ సత్తాలొ ఎందుకు చేరలేదు?

ఈ చర్యను కొందరు అభిమానులు స్వాగతించడం టివీల్లో చూపారు. అది సహజం. రాష్ట్రమంతా అభిమానులతొ నిండిలేదె! మరి ఇది అందరిని మెప్పించగలిగె చర్యన? తనను చూడడానికి ఎగబడుతున్న జనాన్ని చూసి చిరు మోసపోకూడదు. రాష్ట్రప్రజలు ఇప్పుడు మంచి పరిణతి కలిగిన ఓటర్లుగ ఎదిగారు. గతచరిత్ర పరిశీలిస్తె, కొట్టేచప్పట్లన్ని ఓట్లవుతాయని అనుకోవడం వెర్రితనం. చిరు చేయాల్సింది చాలవుంది! మరీముఖ్యంగ, తన పార్టీని బాలారిష్టాలనుంచి గట్టెక్కించాలి అందుకు చురుకైన, సమర్థులైన సహాయకులు అవసరం. ఎదిగి, బలపడాల్సిన ఈసమయంలొ, చిరు బంధుప్రీతిని ఎంతదూరంగ ఉంచగలిగితె అంతమంచిది. తనకు తమ్ముడు ప్రీతిపాత్రుడుకావచ్చు -అందులొ ఎంతమాత్రము తప్పులేదు. దానికి ఒక బంగళ కొనివ్వచ్చు, కొత్త కారు తీసివ్వొచ్చు, గొప్ప సినిమ తీసుకొమ్మని కోటి రూపాయలివ్వొచ్చు -కానీ పార్టీపగ్గాలుకాదు! అందున, ఇప్పుడు ఎన్నికలముందు -మరీముఖ్యంగ, నిర్మాణదశలొవున్నప్పుడు అంతకన్నాకాదు. ఇప్పటికె ఒక కుటుంభపార్టీగ పడుతున్న మచ్చను భలపరచడం ఆరోగ్యదాయకంకాదు. చిరు సియం ఐతె, అల్లు అరవిందే హోం అనుకుంటున్నవాళ్ళూ లేకపోలేదు. పరిపాలనానుభవంలేని వారిచేతికి పగ్గాలివ్వడానికి మేధావివర్గం సమ్మతించకపోవొచ్చు. ఇక్కడ, ఒక శ్రేయోభిలాషిగ చిరుకు నేను చూపే ఉదాహరణ: సోనియ గాంధీ. 2004 లొ తను కావాలనుకుంటె దేశానికి ప్రధానమంత్రి అయ్యుండేవారు. ఈ రాత్రికి అనుకుంటె, రేపు ఉదయానికి తనకొడుకునొ, కూతుర్నో ప్రధానిని చేయగలరు. కాని ఎందుకల జరుగలేదు? తన పిల్లలంటె తనకు ప్రేమలేదని దానర్థంకాదు. అది ఒక పరిణితికలిగిన రాజకీయవేత్త ఎత్తుగడ. సుస్థిరమైన భవిషత్తుకు, తనకుటుంభపాలనకు వేస్తున్న పునాది.

ఒకవేళ సీయం ఐన; చిరు, తనకుతానుగ పాలించలేడు. సహాయకులు, సలహాదారులు అవసరం. వీరి ఎంపిక విషయంలొకూడ తను చాల జాగ్రత్త వహించాలి. ఇది కత్తిమీద సాములాంటిది. మితృలు లేకుండ ముందడుగువేయలేము. అలాగె, వారి ప్రమేయం పెరిగితె మొదటికే మోసం వస్తుంది! ఇందిర గాంధి, రాజీవ్ గాంధి లు ప్రదానమంత్రులుగ ఉన్న రోజుల్లొ దేశవ్యాప్తంగ వారికి భజనపరుల తాకిడి ఎక్కువగ ఉండేది. వీరిలో చాలమంది, వారికింద పందికొక్కుల్లా మెక్కడం మరిగినవారె! వారి సౌలభ్యం కోసమే గాంధీ కుటుంభం పెద్ద పీఠం ఎక్కాలనుకునేవారు ఇప్పుడూ ఉన్నారు. భజనపరులను, భందు ప్రీతిని, పార్టీని సమానంగ బ్యాలెన్స్ చేస్తూ అడుగులు వేస్తేతప్ప చిరు లక్ష్యాన్ని చేరుకోలేరు.

అన్నింటికి మించి, తను మీడియాను ఇంకాదగ్గర చేసుకోవాల్సివుంది. వీలైనంత తరచుగ పాత్రికేయులతో మాట్లాడాలి. పత్రికలు, మరీముఖ్యంగ ఎలక్ట్రానిక్ మీడియ అతన్ని ప్రజలకు మరింత చేరువ చేయగలవు. చివరిగ, నావంటి విమర్శ్యకులు ఎవరికైన మార్గదర్శకులు. మాకు తగు శ్వేచ్చనిస్తెతప్ప, మేము మార్గదర్శకం చేయజాలం. కొన్ని సందర్భాలలొ మా పదజాలం కరుగ్గా వుండవచ్చు. వారు, వారి అభిమానగణం ఓర్పువహించడం వారికేమేలు. చిరుకు రాజకీయానుభవంలేదన్న నిజం చెప్పినందుకు దారికాచి ఒక సినీనటుణ్ణి కొట్టడం పలువురిని భయబ్రాంతుల్ని చేశింది! మనమున్నది ఒక ప్రజాస్వామ్యదేశంలొ, తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చే హక్కు ఇక్కడ ప్రతి పౌరుడికి రాజ్యాంగభద్దంగ సంక్రమించింది. ఏ కారణాలచేతనైన దీన్ని కాలరాయవద్దని అందరికి నామనవి. ఇది మన దేశం, దీన్ని సర్వతోముఖంగ ముందుకు నడిపించాలన్న తపన ఉన్నవాళ్ళందరు రాజకీయ, సామాజిక విశ్లేషణలు, విమర్శలను తమ కర్తవ్యంగ భావించాలి. అందుకు సమయం కూడ తప్పనిసరిగ కేటాయించాలి. అభిమానం వుండడం కద్దు, కాని దురభిమానం వద్దు. అది ఎవ్వరికి మేలుచేయదు. నేను చెప్పాలనుకున్నది నాభాద్యతగ చెప్పాను. దీనిని స్వీకరించడమనేది వారివారి స్వవిషయం.

ముగచింతల దేవి ప్రసాద్, లిబియ

Mugachintala Devi Prasad, Libya

Lecturer in English

Mobile: 00218-926085239

Share SocialTwist Tell-a-Friend